ఓపెన్ఏఐ ఆఫీస్‌లో హైటెక్ డ్రామా బయటపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో నెంబర్ వన్‌గా వరల్డ్ వైడ్ దూసుకుపోతున్న ఓపెన్ఏఐ డెవలప్మెంట్స్పై కన్నేసిన ఒక ఇంజనీర్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను.. ఎఫ్‌బీఐ టెక్నాలజీ సాయంతోనే తిప్పి కొట్టింది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఓపెన్ఏఐ మెయిన్ బోర్డు రూమ్‌లో సీక్రెట్‌గా ఆడియో రికార్డర్ పెట్టినట్లు రుజువు అయింది. దీంతో అబ్దుల్రహమాన్ అల్ఫోజాన్ అనే సౌదీ జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ అధికారులు ఫ్యూచర్ ప్లాన్స్, కోడింగ్ గురించి మాట్లాడే కాన్ఫరెన్స్ హాల్లోని టీవీకి రికార్డర్ కనెక్ట్ చేసి, దానిపై టాయిలెట్ పేపర్ వేసి జాగ్రత్తగా దాచిన విషయాన్ని ఆఫీస్ స్టాఫ్ చాలా తెలివిగా కనిపెట్టడంతో ఈ మ్యాటర్ బయటకు వచ్చింది.
అయితే ఓపెన్ఏఐ టీమ్ తమ ఓన్ ఏఐ మోడల్స్ హెల్ప్‌తోనే ఈ కేస్‌ను సాల్వ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సిస్టమ్ ఇన్పుట్స్, సెక్యూరిటీ డేటాను ఏఐతో అనలైజ్ చేసి..ముందుగా అనుమానితుడిని ట్రాక్ చేశారు. సీసీటీవీ దృశ్యాల్లో నిందితుడు చాలా సార్లు కాన్ఫరెన్స్ రూమ్‌లోకి వెళ్లడం, టీవీ వెనుక చెక్ చేసుకోవడం బయటపడింది. అంతేకాకుండా నిందితుడి వద్ద మరో డివైస్ కూడా దొరకడంతో ఎఫ్‌బీఐ అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. ప్రైవసీ చట్టాలు ఉల్లంఘించాడనే కారణంతో అతనికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ ఫైన్ పడే అవకాశం ఉంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత తమ ఆఫీస్ సెక్యూరిటీని ఓపెన్ఏఐ మరింత స్ట్రిక్ట్ చేసింది. తమ టెక్నాలజీ , క్లయింట్ డేటా ఏమీ లీక్ అవ్వలేదని, ప్రతీదీ సేఫ్‌గానే ఉందని చెబుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
