ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాలకు ప్రభుత్వం రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో రాజకీయ సందడి పెరిగింది.
కొండపల్లి, నిడదవోలు, చింతలపూడి, సూళ్లూరుపేట, గుత్తి, చీరాల, ఏలేశ్వరం మున్సిపాలిటీలు ఎస్సీ మహిళలకు కేటాయించారు. ఉయ్యూరు, నూజివీడు, పిఠాపురం, సామర్లకోట, కుప్పం, పొదిలి, బాపట్ల ఎస్సీ జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
మొత్తం 18 పట్టణాలు బీసీ మహిళలకు, 22 పట్టణాలు బీసీ జనరల్‌కు కేటాయించారు. మరో 27 మున్సిపాలిటీలు జనరల్ మహిళలకు రిజర్వ్ కాగా, 26 మున్సిపాలిటీలు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార ప్రణాళికలపై దృష్టి సారిస్తున్నాయి.
