ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ సదరన్ డిస్కామ్ నూతన కార్యవర్గ ఎన్నికలు అక్టోబర్ 11న తిరుపతిలో నిర్వహించారు. 2027–2028 సంవత్సరాలకు సాయి సుధాకర్ సలహాదారుగా, ఏ.వీ. సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా, చంద్ర మోహన్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా, గణపతి ప్రధాన కార్యదర్శిగా, భాస్కర్ సహాయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర కార్యదర్శి పి. సన్యాసిరావు విద్యుత్ సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయాలని, అర్హులైన ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. అమరావతి రాజధాని ప్రాంతంలో విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు సంబంధించిన ఈఓఐ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు కే.వీ. శేషారెడ్డి మూడు డీఏలు మంజూరు చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీ పోస్టులను త్వరగా భర్తీ చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
