కొడంగల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కావాలి ఆనందం, ఉపాధ్యాయుడి కుమారుడు కావాలి హృషికేష్కు ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సుకు కన్వీనర్ కోటాలో ఉచిత సీటు లభించింది. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామానికి చెందిన విద్యార్థి వైద్య విద్యలో ప్రవేశం పొందడం గర్వకారణమని సత్యనారాయణ ముదిరాజ్ అన్నారు. హృషికేష్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ కొత్తపల్లిలోని ఆయన స్వగృహంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హృషికేష్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
కష్టపడి చదివి వైద్య విద్యలో సీటు సాధించిన హృషికేష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని ఈ విజయం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కావాలి రాములు, నర్సింహులు, కనకప్ప, కే. శ్రీనివాస్, కావాలి రాంచందర్ తదితరులు పాల్గొని హృషికేష్ను సన్మానించారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
