ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పంచాయితీ తేలిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ పెద్దల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఎవరికి ఏ ఏరియా కేటాయించాలనే దానిపై పక్కా క్లారిటీ వచ్చేసింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 123 అర్బన్ బాడీస్‌లో క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కేడర్ జోష్ ఎంత అనే దానిని బేస్ చేసుకుని లెక్కలు తేల్చేశారు.
మొత్తం 123 స్థానిక సంస్థల ఓవరాల్ పిక్చర్ చూస్తే, సింహభాగం సీట్లను తెలుగు దేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంటూనే, మిత్రపక్షాలకు కూడా తగిన భాగం ఇచ్చింది. ఈ ఫార్ములా ప్రకారం టీడీపీ ఏకంగా 89 స్థానాల్లో (72.36%) బరిలోకి దిగుతుండగా, జనసేన 25 సీట్లలో (20.33%), బీజేపీ 9 సీట్లలో (7.32%) తమ కేండిడేట్స్‌ను నిలబెట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి.
ఇక 17 మున్సిపల్ కార్పొరేషన్ల పోరులో టీడీపీ 11 చోట్ల సత్తా చాటడానికి సిద్ధమవుతుండగా, జనసేనకు 4, బీజేపీకి 2 కార్పొరేషన్లు దక్కాయి. దీనిలో జనసేన పార్టీకి దక్కిన కార్పొరేషన్లు పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరుతో పాటు పొలిటికల్‌గా అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయవాడ కార్పొరేషన్‌ను పవన్ కళ్యాణ్‌కు కేటాయించడం విశేషం. మరోవైపు బీజేపీ అకౌంట్లో రాజమహేంద్రవరం, అనంతపురం కార్పొరేషన్లు పడ్డాయి.
ఇక మిగిలిన 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల విషయానికొస్తే, ఇక్కడ కూడా కూటమి నేతలు పక్కా ప్లాన్‌తోనే ముందుకు వెళ్లారు. ఈ మున్సిపాలిటీల్లో టీడీపీ 78 చోట్ల తన లక్‌ను పరీక్షించుకోనుండగా, జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ఎక్కడ ఏ పార్టీకి పట్టుంది, ఏ స్థానంలో ఏ గెలుపు గుర్రాన్ని బరిలో దింపితే కరెక్ట్ అవుతుందనే లెక్కలతో.. ప్రామాణికంగా ఈ పొత్తుల కసరత్తు ముగిసింది. ఎక్కడా, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సీట్ల పంపకాలు సక్సెస్‌ఫుల్‌గా ముగియడంతో, కూటమి శ్రేణులు ఇప్పుడు గ్రౌండ్లోకి దిగి ఎన్నికల ప్రచార మోత మోగించడానికి ఫుల్ జోష్‌తో రెడీ అవుతున్నాయి.
