తెలుగు ఇండస్ట్రీలో మరో స్టార్ కిడ్ ఎంట్రీ ఇచ్చేసింది. సీనియర్ హీరో శ్రీకాంత్, నటి ఊహ.. ముద్దుల కూతురు మేధ ఇప్పుడు అందరినీ సడన్‌గా సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తూ డైరెక్టుగా వెండితెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే శ్రీకాంత్ కొడుకు.. రోషన్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే, ఇప్పుడు చెల్లెలు మేధ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బ్యూటీ గురించే హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
అంతేకాదు అచ్చం పక్కా లవ్ స్టోరీతో వస్తున్న మేధ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీతో రాజమండ్రి రోజ్ మిల్క్ ఫేమ్.. జై జాస్తి హీరోగా చేస్తున్నాడు.
ఇక ఈ పిక్చర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ..మైత్రీ ఇన్ లవ్ అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేసే పి. మహేష్ బాబు ఈ మూవీకి క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసిన పృథ్వీ వనం దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.
కొత్త పెయిర్‌తో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్ స్టోరీ ఆడియన్స్‌ను కచ్చితంగా అట్రాక్ట్ చేస్తుందనే నమ్మకంతో టీమ్ ఉంది. టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవచ్చని ప్రూవ్ చేయడానికి మేధ కూడా ఇప్పుడు అడుగుపెట్టేసింది. మరి జై జాస్తితో కలిసి ఈ బ్యూటీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో, వీళ్ల కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
