లోకల్ బాడీ సమరంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రాసెస్‌లో అభ్యర్థులకు గట్టి షాక్‌లను ఇచ్చింది. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటించకపోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఓటు హక్కు లేకపోవడం వల్ల ఎంతోమంది ఆశావహుల పోటీ కలలు కల్లలు అయిపోయాయి.
ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం జడ్పీటీసీకి పోటీ చేసే కేండిడేట్స్‌కు 2026 జనవరి 1వ తేదీ నాటికి గ్రామీణ పరిధిలోనే ఓటు ఉండాలి. కానీ, ఈ నిబంధనలు పాటించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 10 మంది జడ్పీటీసీ ఆశావహుల నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్స్ పక్కన పెట్టేశారు.
వీరిలో ఆరుగురు జనసేన, ఇద్దరు టీడీపీ, మరొక ఇద్దరు వైసీపీకి చెందినవారు ఉన్నారు. వైసీపీకి చెందిన మరో ఇద్దరు అభ్యర్థులకు మినిమం ఏజ్ 21 ఏళ్లు లేకపోవడం, ప్రభుత్వ రేషన్ డీలర్‌గా బాధ్యతల్లో ఉండటంతో వారి దరఖాస్తులను తిరస్కరించారు.
ఈ నామినేషన్ల తిరస్కరణల జాబితాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల వారసులు ఉండటం విశేషం. బొత్స సత్యనారాయణ సోదరుడి కొడుకు చైతన్య బాబు అలాగే మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కుమారుడు కేఈ రుద్రఫణి వేసిన నామినేషన్లు కూడా ఇలాగే చెల్లకుండా పోయాయి.
అంతేకాకుండా అమరావతి రాజధాని పరిధిలోని విలీన గ్రామాల మినహాయింపు వల్ల గుంటూరు, పొన్నూరు, పెదనందిపాడు స్థానాల్లో కూటమి అభ్యర్థులైన డేగల లక్ష్మీనారాయణ, సుధ సునీత, యుగంధర్, రావెల నాగసౌజన్యల నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రద్దయిన నామినేషన్ల వివరాలను ఒకసారి చూస్తే..
భీమిలి (విశాఖ): జనసేన కేండిడేట్ నక్కా జ్యోతి ఓటు బదిలీ ప్రాసెస్ గడువు లోపు పూర్తికాకపోవడంతో నామినేషన్ రద్దయింది.యాదమరి, చింతలపూడి: జనసేన కేండిడేట్ పుష్పావతి, వైసీపీ నేత భూక్యానాయక్కు ఆయా మండలాల్లో ఓటు లేకపోవడంతో ఇద్దరూ కూడా పోటీకి అనర్హులయ్యారు.
సీతానగరం, కొవ్వూరు: జనసేన కేండిడేట్ గంటా స్వరూపాదేవి గ్రామీణ ఓటు లేక బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.రామకుప్పం: 21 ఏళ్ల ఏజ్ లిమిట్ రూల్ కంటే 6 నెలల వయసు తక్కువగా ఉండటంతో వైసీపీకి చెందిన రాజేంద్రనాయక్ నామినేషన్‌ను తిరస్కరించారు.
పుత్తూరు: వైసీపీ కేండిడేట్ కుమారి అఫిడవిట్లో అసైన్డ్ భూములకు ప్రైవేటుగా విలువ లెక్కించడంతో నామినేషన్ రద్దయి, పోటీలో ఉన్న టీడీపీ కేండిడేట్ సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దొరవారిసత్రం: టీడీపీ కేండిడేట్ కృష్ణయ్య పదవిలో ఉంటూ నామినేషన్ వేయడంతో తిరస్కరణకు గురయ్యారు.
అయితే సాలూరు మున్సిపల్ పరిధిలో మాత్రం టీడీపీ రెబల్ కేండిడేట్‌గా పోటీకి దిగిన నిమ్మది శ్యామల, కూటమి ఒప్పందంలో భాగంగా.. ఆ సీటును జనసేన పార్టీకి కేటాయించడంతో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని కూటమికి మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.
