కడప రాజకీయం అంటేనే ఒక రేంజ్లో పొలిటికల్ హీట్ ఉంటుంది. ఇక లోకల్ బాడీ ఎన్నికల నామినేషన్ల రచ్చ మొదలయ్యాక పులివెందులలో ఆ కాక మరింత పెరిగింది. ప్రశాంతంగా సాగాల్సిన నామినేషన్ల ప్రాసెస్ కాస్తా ఉద్రిక్తతల మధ్య సాగుతుండటంతో, లా అండ్ ఆర్డర్ కాపాడాలనే ప్లాన్‌తో ఖాకీలు రంగంలోకి దిగారు.
దీనిలో భాగంగా పులివెందుల అర్బన్ సీఐ ఏకంగా.. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి నివాసానికి వెళ్లి అఫీషియల్‌గా నోటీసులు చేతిలో పెట్టడం ఇప్పుడు టోటల్ డిస్ట్రిక్ట్‌లో సంచలనంగా మారింది.
ఎలక్షన్ సమయంలో ఎవరూ పరిమితులు దాటకుండా ఉండటానికి బీఎన్ఎస్ సెక్షన్ 163, అలానే పోలీస్ యాక్ట్ సెక్షన్ 30ని పట్టణమంతా కూడా అప్లై చేస్తున్నట్లు ఆ నోటీసులో స్పష్టం చేశారు.
ఈ రూల్స్ ప్రకారం ఎన్నికల సమయంలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా వీధుల్లోకి వచ్చి ర్యాలీలు చేసినా, మైకులు పెట్టి సభలు నిర్వహించినా చూస్తూ ఊరుకోమని పోలీసులు హెచ్చరించారు. కనీసం వీధుల్లో, ఆ ఏరియాల్లో ఐదుగురికి మించి జనాలు పోగైనా సరే నిబంధనలు బ్రేక్ చేసినట్లేనని వారిని ఖాకీలు వార్నింగ్ ఇచ్చారు.
అయితే పోలీసుల ఈ సడన్ నిర్ణయంపై ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు స్థానిక వైసీపీ కేడర్ విపరీతంగా ఫైర్ అవుతోంది. తమ పార్టీ కేండిడేట్స్ ధైర్యంగా సెంటర్లకు వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేయకుండా తమను భయపెట్టడానికే రూలింగ్ పార్టీ సపోర్ట్‌తో పోలీసులు ఈ ఆంక్షలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఖాకీ వ్యవస్థను ఇలా వాడుకుంటున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా పరిస్థితి చేజారకుండా ఉండటానికి పులివెందుల వీధుల్లో భారీగా సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసు బలగాలను దించేశారు.