ఏపీ రాజకీయాలలో ఊహించని, అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అధికారిక హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండటానికి ఎప్పుడూ ప్రాధాన్యమిచ్చే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి తన మార్కు సింప్లిసిటీని చూపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ప్రొటోకాల్ ప్రకారం తన వెంట రావాల్సిన సైరన్ల కాన్వాయ్‌ను, కట్టుదిట్టమైన పోలీసు భద్రతను, సిబ్బందిని పూర్తిగా పక్కన పెట్టేసి, అత్యంత సాధారణ వ్యక్తిలా డైరెక్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే.. పవన్ ఇలా వెళ్లి సీఎంను కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయలేకపోయిన కేండిడేట్స్ నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి.. వారికి మరొక 48 గంటల సమయమిచ్చే అంశాన్ని రివ్యూ చేయాలని ఏపీ ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) సుప్రీంకోర్టు సూచించింది.
కాగా కోర్టు ఇచ్చిన ఈ కీలక ఆదేశాలతో ఏపీలో ఉన్న 19 మున్సిపాలిటీలతో పాటు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రాసెస్‌పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందనే దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూర్చుని లోతుగా చర్చించారు. న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూనే, దీనిని ఆసరాగా చేసుకుని వైసీపీ చేసే పొలిటికల్ అటాక్స్‌ను ఎలా తిప్పికొట్టాలనే దానిపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ కేవలం పార్టీ, కూటమి ప్రయోజనాల కోసం ఇప్పుడు ప్రొటోకాల్‌ను కూడా పక్కనపెట్టి వచ్చారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. క్రిటికల్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు అధికారిక హంగుల కంటే, పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లడమే ముఖ్యం అనే పవర్ ఫుల్ మెసేజ్‌ను పవన్ తన పార్టీ శ్రేణులకు పంపించారు. మరి రాబోయే 48 గంటల్లో ఎస్ఈసీ తీసుకోబోయే నిర్ణయం ఆధారంగా ఏపీ పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి .
