ఏపీ స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను, ఇచ్చిన తీర్పును కొన్ని మీడియా సంస్థలు తమకు అనుకూలమైన కోణంలోకి తిప్పుకుని ప్రచారం చేయడాన్ని న్యాయ నిపుణులు తప్పు పడుతున్నారు.
విచారణ సమయంలో ధర్మాసనం తాము ఎలక్షన్ ప్రాసెస్‌కు భంగం కలిగించే ఆలోచనతో ఎలాంటి మాండమస్ ఆర్డర్ ఇవ్వడం లేదు.. నామినేషన్ల లాస్ట్ డేట్‌ని మార్చే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్శల్ ఆర్డర్స్ ఇవ్వకూడదనే భావిస్తున్నామని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
రాజ్యాంగ పరిధికి గౌరవం ఇస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అనేది ఇండివిడ్యువాలిటీ కలిగిన సంస్థ అని, వారి అధికార పరిధిలో తాము డైరెక్టుగా జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. బాధితులు ఎవరైనా ఎస్ఈసీని ఆశ్రయించినప్పుడు ఆ ఫిర్యాదులను ఈసీ తిరస్కరిస్తే, కేండిడేట్స్ తగిన ఆధారాలతో ఆ తర్వాత ‘ఎలక్షన్ పిటిషన్’ దాఖలు చేసుకోవచ్చని లీగల్ వే సూచించింది.
పరిస్థితి ఇలా ఉంటే కొన్ని ప్రచార మాధ్యమాలు మాత్రం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమగ్ర ఎన్నికల షెడ్యూల్‌ను మార్చివేసినట్లు, నామినేషన్ల గడువును కూడా అందరికీ పెంచినట్లు భ్రమలు కల్పించేలా వార్తలను ప్రసారం చేశాయన్న వాదన వినిపిస్తోంది.
కాగా దీనిపై సుప్రీంకోర్టు నామినేషన్ల గడువును పెంచడానికి ఏమాత్రం ఇష్టపడలేదని..కేవలం తమకు అందిన ఫిర్యాదులను పరిశీలించే బాధ్యతను మాత్రమే ఎస్ఈసీకి అప్పగించింది అనేదే ఫ్యాక్ట్ చెక్‌లో నిరూపితమైన పచ్చి నిజం అని కూటమి శ్రేణులు వివరిస్తున్నాయి.
