రాధా బరిలోకి దిగడంతో విజయవాడ మేయర్, కార్పొరేషన్ రెండూ వార్ వన్ సైడే నడుస్తాయని సామాన్య జనం సైతం కామెంట్లు పెడుతున్నారు. అంతకు ముందు కార్పొరేషన్ను వెలంపల్లి శ్రీనివాసు చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూశారు. అప్పటి మేయర్ టీడీపీ కాబట్టి ఎదురు నిలిచారు గాని.. ఆపలేకపోయారు.
ఇక తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చాక వైసీపీ మేయర్ భాగ్యలక్ష్మి కాంప్రమైజ్ ఫార్ములాలో పనులు చేసుకున్నారనే టాక్ ఉంది. సరేలే అంతవరకు తీసుకో గాని.. మిగతా వాటిలో వేలు పెట్టమాకు.. అని ఎమ్మెల్యేనో, ఎంపీనో అనడానికి ఇప్పుడు కుదరదు.. ఎందుకంటే అవతల మేయర్ గా ఉండబోయేది వంగవీటి రాధా. మిగతావారిలా ట్రీట్ చేయడం అసలు కుదరనే కుదరదు. వైసీపీ వాళ్లు ఎలాగూ హ్యాండ్సప్ … కాని టీడీపీలో కూడా గుబులు కనపడుతోంది.
ఎలాగూ గెలుస్తాడు.. మనకు కూడా మొగుడు అవుతాడా అనే భయం కనపడుతోంది. కాని ఫస్ట్ నుంచి వంగవీటి రాధా ఎవరితోనూ కయ్యం పెట్టుకున్నట్లు కనపడలేదు. తనను డిస్ట్రబ్ చేస్తే మాత్రం వైల్డ్ ఫైర్ చూపిస్తాడు.. అలిగితే సైలెంటుగా పక్కకు వెళ్లిపోతాడు. అందుకే ఎవరూ అంతగా వాదన పెట్టుకోరు. ఇంతగా వార్ వన్ సైడుగా కనపడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదో చూపించాలని తాపత్రయపడుతున్నట్లు కనపడుతోంది.
అందుకే దేవినేని అవినాష్ను రంగంలోకి దిగాలని ఆదేశించినా… అక్కడ అవినాష్ సారీ చెప్పేశాడు. ఎందుకంటే రిజల్ట్ వాళ్లకు తెలుసు. జగన్ మాత్రం అవినాష్ కు అవమానం అయినా పర్వాలేదన్నట్లే ఆదేశాలు ఇచ్చేశాడు. ఇప్పటికే అవినాష్ పోటీ చేసిన ప్రతిసారీ ఓటమి పాలై.. ఈసారైనా జాగ్రత్త తీసుకుందామనుకుంటుంటే… జగన్ ఇలా చేస్తున్నాడు. ఇక తప్పక మొన్నటివరకు మేయర్ గా ఉన్న రాయన భాగ్యలక్ష్మినే రంగంలోకి దింపారు.
అసలు సరిగా చూసుకుంటే రాధా వైసీపీలోనే ఉండేవాడు. ఒక గౌతమ రెడ్డి కోసం రాధాను వదులుకున్నాడు జగన్. ఆ గౌతమ్ రెడ్డి ఏమైనా విజయవాడలో ఏదైనా గెలిపించగల సత్తా ఉన్నవాడా అంటే అది లేదు. ఎందుకంటే మొదటి నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి కాపు సామాజికవర్గం మీద చూపు తేడాగానే ఉంటుంది. అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం గతంలో రంగాలాంటివారిని, కన్నా లక్ష్మీనారాయణ, జక్కంపూడి అందరినీ జిల్లాల్లో తన ఫాలోవర్స్ గా పెట్టుకున్నాడు. లాభపడ్డాడు.
కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఈక్వేషన్లు మారిపోవడంతో.. మనకు ఎలాగూ వర్కవుట్ అవదని జగన్ ఇలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కాపు రిజర్వేషన్ల విషయంలో కూడా అంతే. ముద్రగడను ఎగదోసింది ఆయనే… మళ్లీ కాపు రిజర్వేషన్లు కుదరవని చెప్పిందీ ఆయనే. చంద్రబాబు మాత్రం తెలివిగా రాధాను రాష్ట్రమంతా తిప్పి తమవాడు అనిపించుకున్నారు. కాని పదవులు ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతకంటే తెలివిగా పదవి ఇచ్చి మరీ.. తన వాడు అనిపించుకున్నారు.
ఇక విజయవాడలో అయితే కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ.. నెంబర్ పరంగా ఎస్సీలు, మైనారిటీలు, నగరాలు అందరూ ఉన్నారు. కాని వీరంతా ఏ పార్టీ వైపు ఉన్నా.. వంగవీటి ఫ్యామిలీ అంటే మాత్రం రంగా ఫోటోను చూసి ఓటేసేస్తారు అని అంచనాలు వేస్తున్నారు. ఇక కమ్మ సామాజికవర్గం టీడీపీ వైపు ఉంది.. వారు ఎటూ వైసీపీకి వేయలేరు కాబట్టి రాధాకు వేయాల్సిందే. అలా ఏ లెక్కన చూసినా వార్ వన్ సైడే అనిపిస్తోంది.
