బాలీవుడ్ నటుడు, అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్కు ముంబై పోలీసులు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చారు. అక్టోబర్ 28వ తేదీ లోగా భారతదేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ ఆయనకు అత్యవసర నోటీసులు జారీ చేసింది. భారత పౌరుడు కాకపోయినా కూడా ఇక్కడి రాజకీయ నిరసనల్లో చురుగ్గా పాల్గొని.. చట్ట ఉల్లంఘనకు పాల్పడినందుకు గాను ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ పోలీసుల నిర్ణయంతో బి-టౌన్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.ఇటీవల ముంబైలోని చారిత్రాత్మక ఆగస్టు క్రాంతి మైదాన్లో ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా.. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు నటి లేఖా వాషింగ్టన్, ఇతర కజిన్స్ కూడా ఈ ఆందోళనలో కనిపించారు.ఆ సమయంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఇమ్రాన్తో సహా సుమారు 4 వందల మందిని కస్టడీలోకి తీసుకుని వ్యాన్లో స్టేషన్కు తరలించి..కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. వ్యాన్ లోపల నుంచి ఇమ్రాన్ షేర్ చేసిన ఫోటోలు, జై హింద్ అంటున్నఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ముంబై ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్స్..ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ వద్ద అసలు భారతీయ పౌరసత్వం లేదని, ఆయన అమెరికా పాస్పోర్ట్ కలిగి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాలోనే ఇండియాలో నివసిస్తున్నారని అధికారులు గుర్తించారు.భారత రాజ్యాంగం , ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. ఓసీఐ కార్డర్లు ఎలాంటి పొలిటికల్ నిరసనలు లేదా ఆందోళనల్లో భాగస్వాములు కాకూడదు. ఈ రూల్ను అమీర్ మేనల్లుడు ఉల్లంఘించడంతో.. ఇమ్మిగ్రేషన్ చట్టం కింద ఇమ్రాన్ ఖాన్కు గడువును విధిస్తూ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని బాలీవుడ్ చర్చించుకుంటుంది.
