Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Monday, October 12
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?
    ఆంధ్ర ప్రదేశ్

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    Point News Point NewsBy Point News Point NewsOctober 12, 2026No Comments3 Mins Read46 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    KUMAR CHAND PULLAGURA

    బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు ఎవరికోసం..? సామాన్య భక్తుల కోసమేనా..? అన్న ప్రశ్న వేస్తే అందుకు ఠక్కున వచ్చే సమాధానం హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకు మాత్రమే అని వస్తుంది. అలాగే దుర్గ గుడి ఉత్సవాల్లో విధులు నిర్వహించాలన్నా.. అందుకు దుర్గ గుడి ట్రస్ట్ బోర్డ్, దుర్గ గుడి ఈవో పచ్చ జెండా ఉపాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో దుర్గ గుడి చిక్కుకుంది. హై లెవల్ రికమండేషన్లు ఓ వైపు వీరి వద్ద వర్కౌట్ అవుతుంటే.. మరోవైపు అధికారం ఉన్న జిల్లా అధికారులు తమ ఇష్టానుసారం విధులు నిర్వహించేందుకు ఇవ్వాల్సిన పాసులపై నియంత్రణను చేస్తూ ఈ ఏడాది విమర్శలకు లోను అయ్యేలా చేస్తోంది. మరో విషయం ఏంటంటే.. అస్సలు దుర్గ గుడికి సంబంధం లేకుండా ఎటువంటి ఉద్యోగం దుర్గ గుడిపై లేని ప్రయివేట్ వ్యక్తులకు డ్యూటీ పాస్ లను జారీ చెయ్యటం ఏంటో తనకేం సంబంధం లేదని చెప్పుకునే దుర్గ గుడి ఈవోకి, చైర్మన్ లకే తెలియాలి. ట్రూ పాయింట్ మీడియా చేసిన సీక్రెట్ ఆపేరేషన్ లో కొందరు ప్రయివేట్ వ్యక్తులు డ్యూటీ పాస్ లను కలిగి ఉండటం తేటతెల్లమైంది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే.. అని నమ్మే సామాన్యులకు అమ్మ దర్శనాన్ని దూరం చేసే విధంగా నడుచుకుంటున్నారన్న ఆరోపణలు దుర్గ గుడి బోర్డ్ చైర్మన్, ఈవో లపై ప్రస్తుతం తారా స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈవో విషయానికి వస్తే.. దుర్గ గుడి కింద ఉన్న పార్కింగ్ లో ఏమైనా అవకతవకలు జరిగితే నాకేం సంబంధం అంటూ ఈవో చేసిన వ్యాఖ్యలే తెలుస్తున్నాయి ఆయనకు ఎంత నిబద్ధత చిత్తశుద్ధి ఉన్నాయో.. ఇలాంటి అంశాలు చూస్తే తేటతెల్లమవుతోంది. ఇక ఈ ఏడాది దుర్గగుడి మీడియా పాసుల అంశం వివాదాస్పదంగా మారింది. ప్రతి ఏడాది మీడియాకు పాసులు ఇచ్చినట్టుగా ఈ ఏడాది ఇవ్వకపోవడంపై మీడియా ప్రతినిధుల నుంచి సర్వత్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అంతేకాక నిన్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో విధులు నిర్వహించాల్సిన మీడియా ప్రతినిధులకు పాసులు ఇవ్వకుండా మొండి చేయి చూపడంతో మొదటి రోజంతా మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగి నిరసన ప్రదర్శించారు. ఇన్ని నిరసన వ్యక్తమైనప్పటికీ.. జిల్లా కలెక్టర్ లక్ష్మీశా స్పందించకపోవడం గమనార్హం. ఇక ఈ ఏడాది మీడియా పాసులు విషయానికి వస్తే.. ఆ పాసులను తొలుత.. కలెక్టర్ కార్యాలయం నుంచి ఇస్తారని సమాచారాన్ని దుర్గగుడి అధికారులు తెలియజేశారు. తమ చేతిలో ఏమీ లేదంటూ.. ఓవైపు కలెక్టర్ కార్యాలయం రెండోవైపు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనే నిర్ణయాలు జరుగుతాయని ప్రాపగండాని బాగా విస్తృతం చేశారు. ఆ తర్వాత ఎంపీ కార్యాలయంలో కూడా పాసులు ఇస్తున్నారంటూ కొంత ప్రచారం జరిగింది. మొత్తానికి దసరా ఉత్సవాలు సమీపిస్తున్నప్పటికీ పది రోజులుగా పూర్తిస్థాయిలో అటు కలెక్టర్ కార్యాలయం ఇటు దుర్గగుడి అధికారులు, మరోవైపు డి పి ఆర్ ఓ కార్యాలయం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జాప్యం చేసుకుంటూ వచ్చారు. ఉత్సవాలు మొదలయ్యే రెండు రోజులు ముందు దుర్గగుడి అధికారులు పూర్తిస్థాయిలో చేతులెత్తేశారు. తమకు ఏమీ తెలియదని కలెక్టర్ కార్యాలయం లేదా పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి మాత్రమే పాసులు వస్తాయని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఓ ఆన్లైన్ ఫిలింగ్ ఫారంను ఫిల్ చేసి అందించాలని సూచించారు. కానీ ఆన్లైన్ బిల్లింగ్ ఫామ్ కూడా అంతంత మాత్రం గానే సాగింది. మొత్తానికి మీడియా వారికి పాసులు ఇవ్వకూడదు అన్నది మాత్రమే మీడియా వారికి పాసులు ఇవ్వకూడదు అన్నది మాత్రమే తేటతెలమైంది. ఉత్సవాల్లో తొలి రోజు సాయంత్రం కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని డి ఆర్ డి ఏ కార్యాలయంలో మీడియా వారికి పాసులు ఇస్తామంటూ పిలిచి అక్రిడేషన్ కార్డులు లేవని.. రోజు ప్రెస్ మీట్లకు వచ్చి కవర్ చేసే మీడియా ప్రతినిధులు డి పి ఆర్ ఓ ప్రతినిధులకు తెలిసినప్పటికీ వారికి పాసులను ఇవ్వమంటూ డి పి ఆర్ ఓ సిబ్బంది నిరాకరించడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ విధానం కేవలం కావాలని చేస్తున్నదిగా బహిర్గతమైంది. అక్రిడేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి అని, ఆ ఆధారు కూడా విజయవాడకు చెందినదై ఉండాలని నిబంధన సైతం పెట్టారు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీడియా పాసులను ఉత్సవాలకు ముందు రెండు రోజుల ముందే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు ఎటువంటి నిబంధనలు లేకుండా ఇవ్వటం వెనుక ఏదో మర్మం ఉందని పలువురు మీడియా ప్రతినిధులు ఆరోపించారు. మొత్తంగా చూసుకుంటే ఈసారి మీడియాపై వేటు వేయాలన్న దుర్గగుడి ఈవో, దుర్గ గుడి బోర్డు చైర్మన్ టార్గెట్ ఫలించిందని ఆరోపణలు ముమ్మురంగా బయటికి వస్తున్నాయి. గతంలో ఏ ఈవో లేని విధంగా ఈ ఈవో ఉండటం, గతంలో ఏ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లేనివిధంగా ఈ చైర్మన్ ఉండటం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఈ విధానాన్ని ఆమోదించి ముందుకు తీసుకువెళ్ళటం ఈ ఏడాది తీవ్ర ఆరోపణలు వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీడియా పాసులు వ్యవహారం ఇంకా ఎన్నిరోజులు జాప్యానికి గురవుతుందో వేచి చూడాలి.

    ఆంధ్రప్రదేశ్ ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులు విజయవాడ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    పెద్దశేష వాహనసేవలో కళాసంస్కృతుల సందడి

    October 12, 2026

    తిరుపతి అభివృద్ధికి రూ.106 కోట్లు

    October 12, 2026

    కెటిల్‌బెల్ విజేతలకు ఎమ్మెల్యే సత్కారం

    October 12, 2026

    ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు జైలు

    October 12, 2026

    పేదలకు సొంతింటి కల సాకారం

    October 12, 2026

    రూ.3,222 కోట్లతో తిరుపతి అభివృద్ధి

    October 12, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202646 Views

    ఎనిమిదేళ్లుగా పెండింగ్‌.. సీమ నీటికి బ్రేక్‌!

    October 12, 202637 Views
    డోన్'ట్ మిస్

    పెద్దశేష వాహనసేవలో కళాసంస్కృతుల సందడి

    October 12, 2026

    శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన పెద్దశేష వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు సంప్రదాయ కళారూపాలతో భక్తులను…

    తిరుపతి అభివృద్ధికి రూ.106 కోట్లు

    October 12, 2026

    కెటిల్‌బెల్ విజేతలకు ఎమ్మెల్యే సత్కారం

    October 12, 2026

    ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు జైలు

    October 12, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202646 Views

    ఎనిమిదేళ్లుగా పెండింగ్‌.. సీమ నీటికి బ్రేక్‌!

    October 12, 202637 Views
    ఔర్ పిక్స్

    పెద్దశేష వాహనసేవలో కళాసంస్కృతుల సందడి

    October 12, 2026

    తిరుపతి అభివృద్ధికి రూ.106 కోట్లు

    October 12, 2026

    కెటిల్‌బెల్ విజేతలకు ఎమ్మెల్యే సత్కారం

    October 12, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.