ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం తో రాష్ట్ర పరువు తీశారు - ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సమాజం తల దించుకునే విధంగా చేశారు.
మాజీ మంత్రులు ఎవరు మాట్లాడడం లేదు.
కేవలం కవిత, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురే మాట్లాడుతున్నారు.
బీఆర్ఎస్ హయం లో కొండగట్టు ప్రమాదం, 10th ప్యాకేజి లో జరిగిన ఘటన పై ఎప్పుడు వారు స్పందించలేదు.
Slbc ఘటన పై ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా స్పందించింది.
ఇలాంటి ఘటనల పై ప్రతిపక్షంలో ఉన్నవారు సలహాలు సూచనలు చేసి ఘటన స్థలానికి రావాల్సింది.
కానీ సిఎం రేవంత్ రెడ్డి ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.
గతం లోకాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు కాళేశ్వరానికి వెళ్ళనివ్వకుండా బీఆర్ఎస్ అడ్డుకుంది.
10 ఏళ్లలో ఎస్సి, ఎస్టీ లు పెట్టుకున్న ఇండస్ట్రీస్ సబ్సిడీ డబ్బులు ఇవ్వలేదు బీఆర్ఎస్.
2వేల కోట్ల సబ్సిడీ ఎమౌంట్ ఇవ్వలేదు బీఆర్ఎస్.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ని అడ్రెస్స్ లేకుండా చేస్తారు.
14 నెలలుగా మేము ప్రజలతో ఉంటున్నాము.
హరీష్ రావు, కేటీఆర్, కవిత ఇష్టం వచిన్నట్లు మాట్లాడుతున్నానరు.
మా నియోజకవర్గాలలో సాగు, త్రాగు నీరు ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ హయాంలో.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనా పై.. మా 14నెలల పాలనా పై ఎలాంటి చర్చకు వచ్చిన మేము సిద్ధం.
కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు slbc వద్దకు రాలేదు.
దేశం లో తెలంగాణ కూడా ఉంది కదా...
కేంద్రంలో అధికారం లో ఉంది బీజేపీ యే కదా..
కేంద్ర ఇరిగేషన్ మంత్రి ఎందుకు ఒక నోట్ కూడా విడుదల చేయలేదు.
మేము మీకు అండగా ఉంటామని ఎందుకు మాట్లాడలేదు.
slbc ఘటన పై మా సిఎం గారు చాలా బాధలో ఉన్నారు.
ప్రభుత్వం slbc ఘటన బాధితులకు అండగా ఉంటుంది..