కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది - హరీష్ రావు

By Ravi
On
కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది - హరీష్ రావు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి...  ప్రజాస్వామ్యం ఒడిపోయింది.

కాంగ్రెస్, బిజెపి పార్టీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపింది .

పార్టీలపరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి, కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదు .

ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీ లందరూ కలవాలన్న నినాదంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చాయి .

కాబట్టి చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి .

బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవి .

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలి .

విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలి .

విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుంది .

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుంది .

పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ రాష్ట్రస్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేశారు .

రాష్ట్రస్థాయిలో చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంది .

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తోంది .

మూడు ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచకుండా కుట్ర చేస్తుంది .

మూడు అంశాలను ఒకే బిల్లులో పెడితే న్యాయవివాదం తలెత్తుతుంది .

జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి.

ఇది గంభీరమైన అంశం కాబట్టి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి నడుచుకోవాలి.

Tags:

Advertisement

Latest News

మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..! మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..!
లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర కీలకం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన ముడుపుల సొమ్ము ఎక్కడకు మళ్లించారో మిథున్ రెడ్డికి తెలుసు అంతిమ...
సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...
ప్రాణాలు నిలబెట్టే ఆసుపత్రి..10 నిమిషాల్లో రెడీ!
తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!
లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్
Breaking: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..
విజయవాడలో లూలూ మాల్..! ప్రయత్నం సాఫీగా సాగేనా?