ప్రజాపాలనలో 55 వేల ఉద్యోగాల భర్తీ
#ఖాళీల భర్తీకి రూట్ మ్యాప్
#ఉద్యోగులకు పదోన్నతుల కల్పన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే
#ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు
#ప్రాంతీయ అసమానతల నిర్మూలనాపై ప్రత్యేక దృష్టి
#పరిశ్రమల స్థాపనకై ప్రపంచం నలుమూలల నుండి బారులు కడుతున్న పారిశ్రామిక వేత్తలు
#రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం
#తద్వారా నిరుద్యోగ నిర్ములనకు చేయూత
#పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవశ్యం
*-కరీంనగర్-నిజమాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు*
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు నిరుద్యోగ పట్టభద్రులకు ఎంతైనా అవసరం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏర్పడ్డ ప్రజాపాలనలో నిరుద్యోగులకు జరుగుతున్న న్యాయం కొనసాగింపుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ఆవశ్యకత అవసరమన్నారు
ప్రజాపాలనచేపట్టాక కేవలం సంవత్సరం వ్యవధిలో 55 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రజలు కోరుకున్న మార్పుకు నిదర్శనమన్నారు.
అంతే గాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందజేయడంతో పాటు వారికి పదోన్నతులు కలోయించిన ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు.
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా సోమవారం సాయంత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీదర్ బాబు,దలసరి అనసూయ@సితక్క తదితరులు పాల్గొన్న ఈ బహిరంగ సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా వ్యహరిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ అసమానతల పై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు
ప్రత్యేకించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్,మెదక్ జిల్లాలు గత పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని వాటి అభివృద్ధి కై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టిందని,ప్రభుత్వ శాఖాలలలో ఉన్న ఖాళీల భర్తీకి ప్రణాళికలు రూపొందించామన్నారు.
ఏక కాలంలో 11000 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం తో పాటు సంవత్సరం తిరగ కుండానే 55 వేల ఉద్యోగాల భర్తీయో ఇందుకు నిదర్శనమన్నారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు తరలి వస్తూన్నారన్నారు
తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు అవుతాయని ఆయన అన్నారు.ప్రజలు కోరుకున్న మార్పు తెలంగాణా రాష్ట్రంలో అభివృద్ధికి పునాది రాయి అయిందని...అదే అభివృద్ధి కొన సాగింపుకు కరీంనగర్-నిజమాబాడ్-అదిలాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ద్వారా సాధ్యపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టభద్రులను కోరారు.