సెల్ఫీ పేరుతో భర్తను నదిలో తోసిన భార్య! వీడియో వైరల్!!

By Dev
On
 సెల్ఫీ పేరుతో భర్తను నదిలో తోసిన భార్య! వీడియో వైరల్!!

బావా! సెల్ఫీ దిగుదామా అంటూ భార్య వయ్యారం ఒలకబోసింది. అయ్యో అదెంత సేపు పని అంటూ పోలోమని ఫాలో అయ్యాడు ఆ అమాయక భర్త.  భార్య చెప్పిందని ఆశతో ఫోన్ తీసుకుని నది దగ్గరగా వెళ్లి మరీ ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇంతలో భార్య ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది వద్ద భర్త తాయప్పను సెల్ఫీ తీసుకుందామని భార్య చిన్ని నదికట్ట వద్దకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కాడ్లూరులో కలకలం రేపుతోంది.అక్కడ సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను భార్య కావాలనే నదిలో తోసేసింది. 


అసలే..అతనికి ఈతకూడా రాదు. నదిలో నీళ్ల ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. దీంతో అతను కొద్దిదూరం కొట్టుకుని పోయాడు. ఊహించని ఈ దాడి కారణంగా తాయప్ప నదిలో కొట్టుకుపోతూ బయటపడేందుకు తీవ్రంగా యత్నించాడు. ఇంతలో అతని లక్ బాగుండీ.. కాళ్లతో నిలబడేందుకు బండరాళ్లు దొరికాయి . వాటిని పట్టుకున్నాడు. గట్టిగాఅరుస్తుండటంతో ఆ మార్గంలో వెళ్తున్న వారు కొంత మంది అతడి వైపుకి తాడు విసిరారు. అయితే సమయస్ఫూర్తితో స్పందించిన గ్రామస్థులు తాడు సహాయంతో తాయప్పను నది నుంచి బయటకు నెమ్మదిగా లాగి ప్రాణాలు కాపాడారు. ఈ  క్రమంలో అతను తాడు, మనుషుల సాయంతో బ్రిడ్జి మీదకు వచ్చాడు. ఆ తర్వాత తన భార్య తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆమెతో గొడవకు దిగాడు.

 తీరా బయటకి వచ్చాక ఎలా పడిపోయావని అడిగ్గానే  ఆ భర్త జరిగిన తతంగమంతా పూసగుచ్చినట్లు తన కుటుంబసభ్యులకు ఫోన్ లో వివరిస్తున్న వార్త వీడియో చూసిన నెటిజన్లు ఖంగుతింటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.తనను నదిలో తోసిందని ఆరోపిస్తున్న తాయప్ప, ఇది పథకం ప్రకారం పన్నిన కుట్రగా భావిస్తున్నాడు. తన భార్యే  ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకు ఆమె ఇలాంటి పని చేసిందన్న దానిపై విచారణ కొనసాగుతోంది. మనుషుల మధ్య నమ్మకం రోజురోజుకూ తగ్గిపోతున్న సమాజంలో, భార్య భర్తల మధ్య జరిగే సంఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యకరమే కాకుండా ప్రమాదకరంగా కూడా మిగులుతున్నాయనడానికి ఈ ఘటన ఓ నిదర్శనం.

Advertisement

Latest News