ఒక్క రూపాయికి ఒక్క నిమిషంలో న్యాయ సలహా..! 'ఆదర్శ్'నీయంగా యువలాయర్ల న్యాయసేవలు

By Dev
On
ఒక్క రూపాయికి ఒక్క నిమిషంలో న్యాయ సలహా..! 'ఆదర్శ్'నీయంగా యువలాయర్ల న్యాయసేవలు

చిత్తశుద్ధితో ప్రయత్నం.. సామాన్యులకు అందుబాటులోకి 'న్యాయం'

ఆర్థికంగా వెనుకబడిన వారికి, సమాజంలో సరైన మార్గనిర్దేశం లేని అమాయకులకు అండగా నిలవాలన్నదే ఆశయం

మనలో చాలామందికి న్యాయపరంగా ఎన్నో సందేహాలు ఉంటాయి. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు..మనల్ని మనమే రక్షించుకోవాలన్నప్పుడు న్యాయవ్యవస్థే మార్గం. అయితే ఎవరైనా లాయర్ ను కలవాలంటే  వేలకు వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  కొంతమంది లాయర్లు  సమస్య  వినాలంటేనే 300 నుంచి 5000 వరకు ఛార్జ్  చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకొందరు బాధ వినాలంటే కూడా ఛార్జ్ చేసే దుస్థితి. ఇక రాజకీయనాయకులవంటి కేసులైతే ఒక్క రోజుకు కోట్లు తీసుకునే నల్లకోటు న్యాయవాదులూ ఉన్నారు. వాయిదా వాయిదాకు వాయిదాలుగా ఫీజులు తీసుకునే లాయర్లకు కొదవలేదు.  ఎందుకు అంత  చెల్లించాలని ప్రశ్నిస్తే న్యాయ సలహాలు  చెప్పడానికి మా సమయం ఎందుకు వృథా చేసుకోవాలనే కచ్చితమైన కఠినమైన మనసుండే లాయర్లే ఎక్కడ చూసినా..

ఇలా అన్నిచోట్ల ఇలా ఉంటే..చీకటిని చీల్చుకుని వచ్చే సూర్యుడిలా 9 మంది ఫ్రెండ్స్ తో కలిసి తెలంగాణలోని జనగామ జిల్లా  పాలకుర్తి మండలం  చెన్నూరుకు చెందిన ఆదర్శ్ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది సామాన్యులకు గొప్ప ఊరటనిస్తోంది. 'సీఎల్ఎన్ఎస్.ఇన్'   యాప్ ద్వారా కేవలం  రూపాయి చెల్లించి న్యాయ సలహాలను పొందే వ్యవస్థని సృష్టించాడు.  సెంట్రలైజ్డ్  లీగల్ నెట్వర్క్  సొల్యూషన్స్  యాప్ లో రూపాయి చెల్లించి న్యాయ సేవలకు సంబంధించిన  పూర్తీ సమాచారాన్ని పొందే అవకాశం కల్పించారు.

ఈ యాప్ లో దేశవ్యాప్తంగా  ఉన్న న్యాయవాదులను భాగస్వామ్యం చేశారు.  తెలంగాణ టీహబ్ నుంచి సైతం కార్యకలాపాలను  సాగిస్తున్నామని యువ న్యాయవాది ఆదర్శ్  పేర్కొన్నారు. మే 2025లో ప్రారంభమైన ఈ స్టార్టప్ ద్వారా  ఇప్పటివరకు 3,000 మందికి పైగా న్యాయ సహాయ సహకారాలు అందించారు.    'న్యాయవాదిని వెతకండి (ఫైండ్ ఎ లాయర్), అధికారులతో మాట్లాడండి (టాక్ టు అఫీషియల్), అవర్ సర్వీసెస్ (మా సేవలు) ఎంపికల ద్వారా విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజలు, అధికారులను  ఒకే వేదికపై  తీసుకొచ్చేలా  టెక్నాలజీని  రూపొందించి ఆదర్శంగా నిలుస్తున్నారు. సీఎల్ఎన్ఎస్ యాప్ లో రిజిస్టర్ చేసుకుని..లాగిన్ కావడం ద్వారా సేవలు పొందవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి కక్షిదారులకు అవసరమైన సమాచారం అందే ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులైన యువ లాయర్లు యావత్ సమాజానికి ధైర్యమిస్తున్నారు.

న్యాయసలహా కోసం  Contact – clns.in వెబ్ సైట్ సంప్రదించవచ్చు...

 వ్యక్తిగత, కక్షపూరిత అంశాలు కాకుండా సమాజానికి మంచి చేసే విషయాలలో న్యాయసలహాలు తీసుకోవడానికి ఉపయోగించుకోండి అంటూ చేయాలనుకున్న పనిని సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నం న్యాయ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చి ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి, సరైన మార్గదర్శకత్వం లేని వారికి అండగా నిలవాలన్నదే మంచి ఉద్దేశ్యం, అంతిమలక్ష్యం.

 

Advertisement

Latest News

సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి... సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...
అందం ఎరవేసి బౌద్ధ గురువులు, సన్యాసులను ఉచ్చులోకి లాగి, రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మాయలేడి వ్యవహారం థాయ్‌లాండ్‌లో సంచలనం సృష్టించింది. గత నెలలో బ్యాంకాక్‌లోని బౌద్ధ...
ప్రాణాలు నిలబెట్టే ఆసుపత్రి..10 నిమిషాల్లో రెడీ!
తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!
లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్
Breaking: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..
విజయవాడలో లూలూ మాల్..! ప్రయత్నం సాఫీగా సాగేనా?
ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్!